Thu Dec 19 2024 18:14:15 GMT+0000 (Coordinated Universal Time)
కారు - కంటెయినర్ ఢీ ఐదుగురు మృతి
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. నిన్న రాత్రి కడప వైపు నుంచి వస్తున్న కారును కంటెయినర్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కంటెయినర్ కడపకు వెళుతుంది. ఘాట్‌రోడ్ లో మూడో మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.
ఒకే కుటుంబానికి చెందిన...
దీంతో కారులో ఉన్న నాగయ్య, వల్లెపు చిన్న వెంకటమ్మ, నాగలక్ష్మిదేవి, షరీఫ్ మరణించారు. కంటెయినర్ కూడా లోయపడింది. డ్రైవర్ మరణించాడు. బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story